సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం – వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, Let’s celebrate New Year with joy – Warangal Police Commissioner Ambar Kishore Jha
వరంగల్: సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ప్రశాంతవంతమైన వాతవరణంలో ఎలాంటి ఆవాంనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోనేందుకు పలుసూచనలు చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం ప్రకటన విడుదల చేసారు.
డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, క్రైమ్, షీ టీమ్స్ పాటు పెట్రోలింగ్ విభాగాలకు చెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు అర్ధరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాల్సి వుంటుందని. ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్భంగా ఏర్పాటు చేసే సంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవడంతో పాటు, వేడుకలు నిర్వహించుకునే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, అలాగే కార్యక్రమాల నిర్వహణ ప్రదేశంలో తప్పనిసరిగా సిసి కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరీటీ సిబ్బంది ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుందని.ఈ వేడుకలు జరిగే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఇండ్లవారికి ఇబ్బందులు కలగకుండా.
తగు చర్యలు తీసుకోవాలని, వేడుకల్లో ఎలాంటి మత్తు పదార్థాల వినియోగించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, ప్రధానంగా ఈ వేడుకల వేళ యువకలు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పోలీసులకు చిక్కితే జరిమానతో పాటు జె.లు శిక్ష విధించబడుతుందని, అలాగే వేగంగా వాహనాలు నడపడం, రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేసే వ్యవహరిస్తే సదరు వాహనదారులకు చట్టపరమైన తిప్పలు తప్పవని, రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు రాకుండా ట్రాఫిక్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసుల అధ్వర్యంలో ట్రె సిటీతో పాటు, గ్రామీణా ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనీఖీలు నిర్వహించబడుతాయని, అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోబడుతుందని.. పై ఆంక్షలను ఎవరైన అతిక్రమించిన, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 నంబరు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని, ఈ వేడుకలను ప్రజలు, యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కల్పి సంతోషకరమైన వాతరణంలో నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.